- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వింత ప్రవర్తన
ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్లు సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని పేదలను పట్టించుకునే పాపాన పోవడం లేదు.

దిశ, వర్థన్నపేట : ప్రభుత్వ ఆసుపత్రిల్లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్లు సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని పేదలను పట్టించుకునే పాపాన పోవడం లేదు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పేషెంట్లకు అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు సెలవు దినాల్లో ఒక్కరూ కూడా అందుబాటులో ఉండకపోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కట్రియాల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ పల్లె శైలజా పురిటి నొప్పుల తో భాదపడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయం లో డ్యూటీ డాక్టర్ లు లేరని హాస్పిటల్ సిబ్బంది చెప్పడం గమనార్హం. వెనుతిరిగి వర్దన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తన స్వగ్రామమైన కట్రియాలకు వెళ్లింది. పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ లో వరంగల్ సీకేఎం ఆసుపత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు గర్భిణీ స్త్రీని పరీక్షించి అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది శైలజ.
వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో..
వర్థన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయానికి లేకపోవడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి మామూలుగా ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే ఎవ్వరిదీ బాధ్యత అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్దన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత మంది వైద్యులు విధులకు హాజరు కానప్పటికీ నాలుగు రోజుల సంతకాలు రిజిస్ట్రార్ లో ముందస్తుగా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వేలాది రూపాయలు సాలరీలు తీసుకుంటూ పేద ప్రజలను పట్టించుకోరా..? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ డాక్టర్లు విధులకు గైర్హాజరు కాకుండా చూస్తే.. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని స్థానికులు కోరుకుంటున్నారు.






