- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 15 మంది ఎస్‌ఐల బదిలీలు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 15 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన కారణాల రీత్యా తక్షణమే ఈ బదిలీలు అమలులోకి రానున్నట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలలో భాగంగా ప్రధాన మార్పులు ఇలా ఉన్నాయి.. రణధీర్ రావుల (వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్) నుండి ఎస్ హెచ్ ఓ దుగ్గొండి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. ఎన్. వెంకటేశ్వర్లు ( ఎస్ హెచ్ ఓ దుగ్గొండి) నుండి ఇంతేజర్గంజ్‌కు బదిలీ చేశారు.
ఎన్. రవి కిరణ్ (సుబేదారి) నుండి ఇంతేజర్గంజ్‌కు, ఎస్.విట్టల్ (మట్‌వాడ) నుండి పరకాల కు, శివకృష్ణ (పరకాల ) నుండి మట్‌వాడకు, నవీన్ కుమార్ (మట్టేవాడ) నుండి కేయూసీ పోలీస్ స్టేషన్‌కు, బి. శ్రీనివాస్, మోటెం సతీష్, కే. శ్రవణ్ కుమార్, బి. జనార్ధన్, ఇ. నారాయణ, జి. సీతా రాములు లాంటి వారు ఇటీవలే ప్రమోషన్ పొందినవారిగా వివిధ స్టేషన్లకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఆధీనంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్‌లకు బదిలీ అయిన ఎస్‌ఐ లు కొత్త చోటులో హాజరై విధుల్లో చేరాలని పోలీస్ అధికారులు సూచించారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించి, రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.






