- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాన వీధులే ఇలా ఉంటే.. మిగతావి ఎలా..? మున్సిపల్ యంత్రాంగం మౌనవ్రతం
వరంగల్ మహానగరంలో శానిటేషన్ అంటే కేవలం డస్ట్‌బిన్లకు మాత్రమే పరిమితమైపోయిందా? అనేది ఇప్పుడు ప్రతి పౌరుడి మనసులో ఉన్న ప్రశ్న.

దిశ, వరంగల్ టౌన్: వరంగల్ మహానగరంలో శానిటేషన్ అంటే కేవలం డస్ట్‌బిన్లకు మాత్రమే పరిమితమైపోయిందా? అనేది ఇప్పుడు ప్రతి పౌరుడి మనసులో ఉన్న ప్రశ్న. నగరంలోని ప్రధాన రహదారుల వెంట చెత్తాచెదారం, మురికివాడలు, తడిసిముద్దయిన కాలువలు నగర అభివృద్ధికి మచ్చతెస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయం దాకా వెళ్లే మార్గంలోనే శానిటేషన్ అస్తవ్యస్తంగా ఉండటం అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది.
పాపయ్యపేట చమన్ నుంచి బల్దియా కార్యాలయం దాకా, ఎంజీఎం కూడలి నుంచి పోచమ్మమైదాన్ సెంటర్ దాకా రహదారులన్నీ చెత్తతో ముసురుకుని ఉండటం దారిలో వెళ్లేవారికి అసహ్యం కలిగించే పరిస్థితి. కాలువలు చెత్తతో నిండిపోవడంతో నీరు నిలిచిపోతుండటం, దోమల పెంపుతో మహమ్మారులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక గోపాలస్వామి టెంపుల్ ప్రాంతంలో కూలగొట్టిన ఇళ్లు, వారి మలినాలు అక్కడే పడేసి ఏళ్ళు గడిచినా తొలగించకపోవడం నగర శుభ్రతపై ప్రశ్నలు లేపుతోంది.
నిత్యం నగర మేయర్, అధికారులు గుండుగా వెళ్లే ఈ మార్గాలు ఇలా ఉండటం చూస్తుంటే, శానిటేషన్ సూపర్వైజర్లు, సంబంధిత అధికారుల పనితీరు పట్ల తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయాల్సిన పాలకులు ప్రజలే అపాయంలో పడేస్తున్నారనే వాదనలు బలపడుతున్నాయి. ఇంతకీ, ఈ చెత్త పరిస్థితిపై బల్దియా అధికారులు ఎప్పటికి స్పందిస్తారు? ప్రజల సహనానికి ఓ హద్దు ఉంటుంది కదా..!






