- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Warangal: మంగపేట మండలంలో ఐదు కొత్త పంచాయతీలు
మంగపేట మండలంలో ఐదు కొత్త పంచాయతీలు ఏర్పడనున్నాయి.

దిశ, మంగపేట : మంగపేట మండలంలో ఐదు కొత్త పంచాయతీలు ఏర్పడనున్నాయి. ప్రజల స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఏర్పడే కొత్త పంచాయతీలు, వాటి నైసర్గిక స్వరూపాలతో కూడిన చిత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి మండల అధికారులు అందజేశారు. మండలంలో ఇప్పటికే 25 పంచాయతీలుండగా కొత్తగా ఏర్పడే ఐదు పంచాయతీలతో వాటి సంఖ్య 30కి చేరనుంది. మండలంలోని కొత్తూరు మొట్లగూడెం పంచాయతీ నుంచి తొండ్యాల లక్ష్మీపురంను కొత్తగా ప్రతిపాదించగా రేగులగూడెంను శివారు గ్రామంగా చేర్చారు.
నర్సింహాసాగర్ పంచాయతీ నుంచి నరేందర్ రావుపేటను కొత్త పంచాయతీగా ప్రతిపాదించగా గండిగూడెంను శివారు గ్రామంగా చేర్చారు. నర్సింహాసాగర్, మల్లూరు పంచాయతీల నుంచి శనిగకుంటను కొత్త పంచాయతీగా ప్రతిపాదించగా మల్లూరు పంచాయతీలోని మొట్లగూడెంను శివారు గ్రామంగా చేర్చారు. బుచ్చంపేట పంచాయతీ నుంచి జబ్బోనిగూడెంను కొత్త పంచాయతీగా ప్రతిపాదించారు. తిమ్మంపేటలోని అబ్బాయిగూడెంను కొత్త పంచాయతీగా ప్రతిపాదించి బీసీ కాలనీని శివారు గ్రామంగా చేర్చుతూ మొత్తం ఐదు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొత్త పంచాయతీలను స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు ప్రకటించనున్నట్లు తెలిసింది.






