నకిలీ విత్తనాలపై రాష్ట్రంలో తొలిసారి పీడీ యాక్ట్ ప్రయోగం..

by Bhanu |

రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, కాలం తీరిన పురుగు మందులు విక్రయించిన మట్టెవాడకు చెందిన ఇరుకుళ్ళ వేద ప్రకాష్ పై పీడీ యాక్ట్ (ప్రివెన్షన్ డిటెన్షన్) అమలుచేసిన తొలి సంఘటనగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో నమోదు అయింది.

నకిలీ విత్తనాలపై రాష్ట్రంలో తొలిసారి పీడీ యాక్ట్ ప్రయోగం..
X

దిశ, హనుమకొండ : రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, కాలం తీరిన పురుగు మందులు విక్రయించిన మట్టెవాడకు చెందిన ఇరుకుళ్ళ వేద ప్రకాష్ పై పీడీ యాక్ట్ (ప్రివెన్షన్ డిటెన్షన్) అమలుచేసిన తొలి సంఘటనగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో నమోదు అయింది. వేద ప్రకాష్ సారథ్యంలో ఒక ముఠా ఏర్పడి నకిలీ విత్తనాలు, పురుగు మందులు సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ ముఠా నుంచి పోలీసులు ఇప్పటివరకు రూ.49.52 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం మళ్లీ మే 26న అతను నకిలీ పురుగు మందులను విక్రయించడంతో మట్టెవాడ పోలీసులు అతన్ని మళ్లీ అరెస్ట్ చేసి, రూ.11 వేలు విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వుల మేరకు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి, వేద ప్రకాష్ కు పరకాల జైలులో పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు.


అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నకిలీ విత్తనాలు, పురుగు మందుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలనుకుంటే 77998 48333 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని వరంగల్ సీపీ సూచించారు.

Next Story