- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటుకు రూ.10వేలు
పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు, కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు.

ఓటుకు రూ.10వేలు
=మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఖర్చు
=ఓటుకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పంపిణీ
=డబ్బుతోపాటు మద్యం, కానుకల అందజేత
=గెలుపే లక్ష్యంగా ఖర్చుకు వెనకాడని అభ్యర్థులు
దిశ, వరంగల్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల గెలుపు కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కానుకలు ఇస్తున్నారు. డబ్బులు, మద్యంతో పాటు ఇతర వస్తువులను వారికి ఇస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గెలుపు కోసం ఓటుకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు పంపిణీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి అభ్యర్థులు భారీగా ఖర్చు పెడుతున్నారు. కొన్నిచోట్ల ట్రయాంగిల్ పోరు ఉండటంతో బయటపడేందుకు ఖర్చుకు వెనకాడడం లేదు.
మద్యం, డబ్బుల ప్రవాహం..
పోటీలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు, కొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో చూసినా అభ్యర్థులు ఓటుకు రూ.2వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే వార్డుల్లో మద్దతుదారుల ద్వారా ఓటర్లకు పంపిణీ చేయగా, మరికొంత మంది పోలింగ్ కు వెళ్లే ముందు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీల్లో కొంత మంది అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లకు డబ్బు, మద్యం బాటిళ్లు, చీరలను పంపిణీ చేస్తుండగా మరికొంత మంది చికెన్ కూడా పంపిణీ చేశారు. పరకాల, ములుగు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ రెండు మున్సిపాలిటీల పరిధిలో కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు చెల్లిస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులు రూ.10వేల వరకు ఖర్చు పెడుతున్నారు. డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో రూ.2వేల నుంచి రూ.5వేలు, నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూర్ మున్సిపాలిటీలో ఓటుకు రూ.5వేల వరకు చెల్లిస్తున్నారు.
స్టేషన్ ఘన్పూర్ లోని కొన్ని వార్డుల్లో రూ.8వేల నుంచి రూ.10వేల వరకు, జనగామలో వ్యాపారవేత్తలు, బిల్డర్లు ఉన్న వార్డుల్లో రూ.10వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. కేసముద్రంలో ఓటుకు రూ.5వేల కు పైగా పంచుతున్నారు. ఏ మున్సిపాలిటీలో చూసినా భారీ మొత్తంలో అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా పరిధిలో అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా ఖర్చుకు వెనుకాడటం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా సర్దుబాటు చేస్తున్నారు. వీరికి ధీటుగానే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఛాలెంజ్ గా తీసుకోవడంతో ఖర్చు భారీగా పెరిగింది. ఎన్నికల్లో పంపిణీ కూడా ఎక్కడా దొరకకుండా చేస్తున్నారు. 30 నుంచి 50 ఓట్లకు ఒకరు చొప్పున నియమించి వారికి డబ్బులు, మద్యం అప్పగించి పంపిణీ చేస్తున్నారు. చాలాచోట్ల అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీలో బడ్జెట్ తక్కువగా ఉన్నా అభ్యర్థులు పెట్టే ఖర్చు మాత్రం ఓటర్లతో పాటు జనంను విస్తుపోయేలాగా చేస్తుంది. ఏ అభ్యర్థిని గెలిపిస్తారో ఏ అభ్యర్థిని ఓడిస్తారో తెలియదుకానీ పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చు మాత్రం వెనుకాడడం లేదు.






