రాముడు లేని అయోధ్యలా విశ్వనాథ‌పురం కరెంట్ స్టేషన్

by Ratna Kumari |

రాముడులేని అయోధ్యలా బాగోగులు చూసుకునే వారు లేక కరెంట్ సబ్ స్టేషన్లు మండలంలో అనాథలుగా మిగిలిపోతున్నాయి.

రాముడు లేని అయోధ్యలా విశ్వనాథ‌పురం కరెంట్ స్టేషన్
X

దిశ, గీసుకొండ : రాముడులేని అయోధ్యలా బాగోగులు చూసుకునే వారు లేక కరెంట్ సబ్ స్టేషన్లు మండలంలో అనాథలుగా మిగిలిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.2కోట్లు వెచ్చించి 33/11 కేవీ సబ్ స్టేషన్ ను విశ్వనాధపురం గ్రామ శివారులో ఏర్పాటు చేశారు. దానిని అంగరంగ వైభంగా కరెంట్ అధికారులు ప్రారంబించారు. ఇక్కడి విశ్వనాధపురం , కొమ్మాల, దస్రు తండా , సూర్య తండా, నందానాయక్ తండా గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ సబ్ స్టేషన్ కి ఆపరేటర్ నియమించడంలో పై స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేసే లైన్ మెన్ , ఆన్ మ్యాన్ లకు పని భారం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పరిధిలో ఎర్తింగ్ నీరు పోయడానికి బోరు లేకపోవడంతో ఎర్తింగ్ కి నీరు పోయాలంటే పక్క రైతుల బావులు లేదా గ్రామపంచాయితీ ట్యాంకర్ వాడుకోవాల్సి వస్తుంది . అదేవిధంగా శిలపలకాలు ఏర్పాటు లో కూడా కాంట్రాక్టర్ అలసత్వం వహించి తన యొక్క నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.అదేవిధంగా టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ లో కూడా ఒక్కరే ఆపరేటర్ ను నియమించడం జరిగింది.ఇతను కూడా రిటైర్ అయ్యాయక మళ్లీ సబ్ స్టేషన్ ఆపరేటర్ గా తీసుకోవడం జరిగింది.

సిబ్బంది కొరత..

మండలంలో మొత్తం కరెంట్ సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. పని భారం భరించలేక అధికారులు లాంగ్ లీవ్ లోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది.మొత్తం మండలంలో 24 సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉండగా...ఇప్పుడు కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా 20 మంది కి అవకాశం కల్పించాల్సి ఉంది.లైన్ చెకింగ్, ట్రాన్స్ ఫార్మ‌ర్ ఫెయిల్యూర్, రెవెన్యూ కలెక్షన్స్ ,బ్రేక్ డౌన్స్ ఇన్ని రకాల విధులు నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. మళ్ళీ సబ్ స్టేషన్ లో స‌మ‌స్య వ‌స్తే.. చూసుకోవడం తమకు తల పోటుగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన మండలంలోని కరెంట్ శాఖలోని ఖాళీలు ,ఆపరేటర్ల నియామకం చేపట్టి కరెంట్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని రైతులు ,మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story