ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

by Ratna Kumari |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది.

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
X

దిశ, మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాల పాప పై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22 న ఐదేళ్ల పాపను 14 సంవ‌త్స‌రాల ఇద్దరు మైన‌ర్లు ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. చిన్నారి అస్వస్థకు గురి కాగా తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రిలో చికిత్స తీసుకెళ్లగా ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పాప చికిత్స పొందుతుండగా.. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Next Story