ఎంపీ చామల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్

by Chintha Aamani |

భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ చామల కిరణ్

ఎంపీ చామల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్
X

దిశ,బచ్చన్నపేట : భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో ఈరోజు వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకొని పలు రకాల అంశాలపై చర్చించడం జరిగింది. తర్వాత వాస్విక్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు గూర్చి అడిగి తెలుసుకొని అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సేవ కార్యక్రమాలని కొనసాగించాలని తెలిపారు. ఎంపీ కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో అరూరి శ్రీశైలం, ఉప్పలంచి హేమంత్ కుమార్,విక్రమ్ ఉన్నారు.

Next Story