26న వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ

by Elthuri vijay kumar |

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయనున్నారు.

26న వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ
X

26న వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ

కొప్పులలో కులపెద్దలతో సన్నాహక సమావేశం

దిశ,శాయంపేట : శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐలమ్మ విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత, ఏర్పాట్లపై గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు అన్ని కుల సంఘాల పెద్దల సలహాలు, సూచనలు స్వీకరించారు. ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో అన్ని కులాల పెద్దలు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా వంగాల నారాయణ రెడ్డితోపాటు అన్ని కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

Next Story