- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీరనారి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు.

వీరనారి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
- కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నేత పెదగాని సోమయ్య
దిశ,తొర్రూర్ : భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసి రైతాంగ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. బుధవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోమయ్య మాట్లాడుతూ, “ఆ నాటి పరిస్థితుల్లో దేశ్‌ముఖ్, జాగిర్దారుల అన్యాయాలను ఎదురించి భూమి నాది – పంట నాది అని నినదించి పోరాడిన ఐలమ్మ తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక. ఆమె సాయుధ రైతాంగ పోరాటంలో చూపిన ధైర్యం నేటికీ స్ఫూర్తిదాయకం. ఆమె ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల వెంకట చారి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష, రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫైండ్ల సోమయ్య, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మహేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తాళ్ల పెళ్లి బిక్షం గౌడ్, భాస్కర్ రెడ్డి, అలువాల సోమయ్య, వెంకన్న యాదవ్, ముద్దసాని సురేష్, గూడెల్లి రామచంద్రయ్య, వెలుగు మల్లేశ్వరి, హేమంత్ నాయక్, రమేష్ నాయక్, కె.అనిత, మంగళపల్లి యాకయ్య, జలగం వెంకన్న, సట్ల చంటి, యశోద, సుమలత, సునీత, కుంభం మహేష్, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.






