వందే భారత్ కు తప్పిన పెను ప్రమాదం..

by Bhanu |

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.

వందే భారత్ కు తప్పిన పెను ప్రమాదం..
X

దిశ, కేసముద్రం: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రంగాపురం గేటు అప్ లైన్ 428/11 వద్ద మధ్యాహ్నం ఎద్దును ఢీ కొట్టింది. ఎద్దును ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం ఊడిపడింది. దీంతో ఆ రైలు కొన్ని నిమిషాల పాటు నిలిచింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎద్దును ట్రాక్‌పై నుంచి తొలగించారు. రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్) విరిగినట్లు గుర్తించారు.

Next Story