- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరస్వతి అంత్య పుష్కరాల్లో వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్
by Ratna Kumari |
సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, పీఠాధిపతి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం వారు కాళేశ్వరానికి విచ్చేసి సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించారు.

X
దిశ, మహదేవపూర్ : సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, పీఠాధిపతి, శ్రీ దత్త గిరి మహారాజ్ ఆశ్రమం వారు కాళేశ్వరానికి విచ్చేసి సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులకు, భక్తులకు ఆశీర్వచనం చేసారు. ఆలయం తరఫున స్వామివారి శేష వస్త్రాలతో మహారాజ్ స్వామీజీకి అందించారు . ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సలహాదారు గోవింద హరి, ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story






