యాసంగిలో యూరియా కొరతను అధిగమించాలి

by velandi.Saikiran |

మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఎరువుల డీలర్లతో మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్ సమావేశం నిర్వహించారు.

యాసంగిలో యూరియా కొరతను అధిగమించాలి
X

దిశ, ఇనుగుర్తి: మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఎరువుల డీలర్లతో మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా భూక్య మహేందర్ నాయక్ మాట్లాడుతూ, యాసంగి సీజన్ ఆరంభమవుతుండటంతో రైతులకు అన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. యాసంగి పంటకు యూరియా కోరతను అధికమించేందుకు జిల్లా యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన ప్రత్యేక కార్యక్రమానికి స్వీకారం చుట్టిందన్నారు. పకడ్బందిగా స్టాక్ రిజిష్టర్, ఈ పాస్ మిషన్ లో పొందుపరిచి, తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. యాసంగి పంటకు సంబంధించిన‌ యూరియా, కృతిమ కోరత ఏర్పడకుండా డీలర్లు సహకరించాలన్నారు.

Next Story