కేసముద్రంలో ఫుల్ గా తాగిన యూరియా లారీ డ్రైవర్

by Elthuri vijay kumar |

లారీని డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చిన పోలీస్

కేసముద్రంలో ఫుల్ గా తాగిన యూరియా లారీ డ్రైవర్
X

కేసముద్రంలో తప్ప తాగిన యూరియా లారీ డ్రైవర్

- లారీని డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చిన పోలీస్

- రైతు బాధ అర్థం చేసుకున్న కానిస్టేబుల్ అలీమ్ పై స్థానికుల ప్రశంసలు

దిశ, కేసముద్రం : అసలే యూరియా కష్టాలు దీనికి తోడు యూరియా తీసుకవచ్చే లారీ డ్రైవర్ తాగి పడుకున్న సంఘటన కేసముద్రం లో చోటుచేసుకున్నది. లారీ యూరియా లోడ్ వస్తుందని రైతులకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ యూరియా లారీ జాడలేదు. క్యూ లైన్ లో వేచి ఉన్న రైతులు యూరియా కోసం ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనితో అధికారుల ద్వారా పోలీసులు యూరియా లారీ కోసం వాకబు చేయగా, వరంగల్ నుంచి యూరియా లోడుతో లారీ బయలు దేరిందని, ఇప్పటివరకే ఇక్కడికి రావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు సదరు లారీ కోసం వరంగల్ నుండి కేసముద్రం వరకు దారి పొడవునా తమ నెట్వర్క్ ద్వారా గాలింపు చేపట్టారు. చివరకు కేసముద్రం దర్గా వద్ద లారీ నిలిచి ఉన్నట్లు గుర్తించి అక్కడికి పోలీసులు చేరుకున్నారు. లారీ డ్రైవర్ లారీ నడపలేని స్థితిలో ఉండడాన్ని గుర్తించారు. దీనితో డ్రైవింగ్ వచ్చిన అలీమ్ అనే కానిస్టేబుల్ లారీని తానే డ్రైవ్ చేసి తీసుకువచ్చి ఉప్పరపల్లి, కల్వల కేంద్రాలకు యూరియా దిగుమతి చేశారు. దీంతో సకాలంలో స్పందించి రైతులకు అండగా నిలిచిన పోలీసులకు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story