- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తికి దక్కని మద్దతు ధర
ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైనా మద్దతు ధర దక్కడం లేదు. సీసీఐ నిబంధనలు సడలించలేదు. వ్యాపారులు

= వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం
=అయినా మారని పరిస్థితి
=సీసీఐ నిబంధనలు యథాతథం
=వ్యాపారులకే అమ్మకాలు చేస్తున్న రైతులు
=మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభమైనా మద్దతు ధర దక్కడం లేదు. సీసీఐ నిబంధనలు సడలించలేదు. వ్యాపారులు తమ సమస్యల కోసం రెండు రోజులు కొనుగోళ్లను నిలిపివేయడంతో సమస్యల పరిష్కారినికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. అయినా పత్తికి మద్దతు ధర పెట్టడం లేదు. సమ్మె విరమించడంతో అమ్ముకునేందుకు పత్తిని మార్కెట్ కు తెచ్చిన రైతులకు ధర నామమాత్రంగా రావడంతో నిరాశ చెందుతున్నారు. పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
= ఉమ్మడి జిల్లాలో జిన్నింగ్, వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల పాటు మిల్లులను నిలిపివేశారు. జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ లో పత్తిని కొనుగోలు చేయలేదు. ప్రభుత్వం హామీతో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లను చేపట్టారు. అన్ని మార్కెట్లతో పాటు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లను చేపట్టారు. సీసీఐ కూడా కొనుగోలు చేపట్టింది. కేంద్రం నిర్ణయించిన ప్రకారం పత్తి క్వింటాలుకు రూ.8110 ధర పెట్టి కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా మార్కెట్లతో పాటు అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ ధర మాత్రం రావడం లేదు. సీసీఐ కొనుగోళ్లను చేపట్టినా మద్దతు ధర చెల్లించడం లేదు. క్వింటాలు రూ.5వేల నుంచి 7వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేస్తుండగా, సీసీఐ రూ.7వేల నుంచి రూ.8వేల మధ్య కొనుగోలు చేస్తుంది. సీసీఐ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలతో రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ముందుగా కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవడం ఇబ్బంది కావడంతో వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు.
తేమ, ఇతర సమస్యలను చూపుతూ ధర తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు రెండు రోజులు కొనుగోళ్లను నిలిపివేసినా రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. తేమ సడలింపు ఇవ్వడంతో పాటు పత్తి కి ధర కల్పించాలని కోరుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పత్తి కొనుగోలు ప్రారంభమైనా వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు మాత్రం పూర్తిస్థాయిలో పత్తిని రైతులు తీసుకురాలేదు. చలి పెరగడం, వ్యాపారులు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడంతో రైతులు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మరో రెండు మూడు రోజుల్లో కొనుగోలు పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ధర పెరిగితే తప్ప మార్కెట్ కు ఎక్కువ మొత్తంలో రైతులు పత్తిని తీసుకువచ్చే పరిస్థితి కనిపించడం లేదు.






