- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మహబూబాబాద్ – గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

దిశ, డోర్నకల్ : మహబూబాబాద్ – గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన సమాచారం మేరకు, ఓ గుర్తు తెలియని పురుషుడు ఓ దిగువ రైలు బోగీలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలం కిలోమీటరు నెం. 441/30 వద్ద మృతదేహాన్ని గుర్తించిన మహబూబాబాద్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు, జీఆర్పీ డోర్నకల్ స్టేషన్ పరిధిలో కేసు (CR No. 21/2025 U/S 174 CrPC) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి వివరాలు తెలియకపోవడంతో, శవాన్ని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి భద్రపరిచారు. మృతుడు తెలుపు రంగు నెక్కర్, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఆధారాలు లభించలేదు. మృతుడికి సంబంధించి ఏవైనా వివరాలు తెలిసినవారు 87126 58602 నంబరుకు సంప్రదించవలసిందిగా పోలీసులు కోరారు.






