అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మామ

by Bhanu |

తన భార్యకోసం అత్త గారి ఇంటికి వెల్లిన అల్లుడితో వివాదం పెట్టుకొని, అల్లుడిని మామ పొడవడంతో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం శివారు ధర్మారం తండాలో శని వారం రాత్రి చోటు చేసుకుంది.

అల్లుడిని కత్తితో పొడిచి చంపిన మామ
X

దిశ, కేసముద్రం : తన భార్యకోసం అత్త గారి ఇంటికి వెల్లిన అల్లుడితో వివాదం పెట్టుకొని, అల్లుడిని మామ పొడవడంతో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం శివారు ధర్మారం తండాలో శని వారం రాత్రి చోటు చేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య తెలిపిన ప్రకారం. మహరాష్ట్రకు చెందిన లూనావత్ బాల (35) కు ధర్మారంతండాకు చెందిన బానోత్ వీరన్న, కైల దంపతుల కుమార్తె మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. భార్య వివాదం పెట్టుకొని తల్లిగారి ఇంటికి కొద్దిరోజుల క్రితం వెళ్లగా ఆమెను తీసుక వెళ్లేందుకు భర్త బాల శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వచ్చాడు. ఈ క్రమంలో మామ తో బాలకు వివాదం ఏర్పడి ఆవేశానికి గురైన మామ కత్తితో బాలపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలను మహబూబా బాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు.

Next Story