అనుమతి లేని నారాయణ పాఠశాల సీజ్..

by Bhanu |

హనుమకొండ హంటర్ రోడ్‌లో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ నారాయణ పాఠశాలపై అధికారులు చురుగ్గా చర్యలు చేపట్టారు.

అనుమతి లేని నారాయణ పాఠశాల సీజ్..
X

దిశ, హనుమకొండ : హనుమకొండ హంటర్ రోడ్‌లో అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ నారాయణ పాఠశాలపై అధికారులు చురుగ్గా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకుంటూ, తరగతులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం పాఠశాలపై తనిఖీలు చేపట్టారు. తద్వారా అక్కడ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ జరుగుతోందని నిర్ధారించిన ఎంఈవో (మండల విద్యాశాఖ అధికారి) ఆధ్వర్యంలో పాఠశాలను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అనుమతుల్లేకుండా నడుస్తున్న పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయన్నారు. తల్లిదండ్రుల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ తరహా పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. నగరంలోని ఇతర అనుమతి లేని విద్యాసంస్థలపై కూడా త్వరలో పరిశీలన చేపడతామని అధికారులు వెల్లడించారు.

Next Story