- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్
రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, జనగామ : రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు ₹4.50 లక్షల విలువైన 28.565 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గరిపల్లి సత్యనారాయణ (47), గొడుగు నాగరాజు (38)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు నిందితులు డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావించి దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఏప్రిల్ 16న రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు ఎక్కి జనగామకు చేరుకుని గుండ్లగడ్డ ప్రాంతంలో దొంగతనం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి రెండు బంగారు చైన్లు (15.674 గ్రాములు), ఒక బంగారు బిస్కెట్ (5.024 గ్రాములు), చెవి కమ్మల జత (7.513 గ్రాములు), చిన్న చెవి కమ్మలు (0.354 గ్రాములు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాదె వెంకట సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. DCP రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ACP పాండేరీ చేతన్ నితిన్, ఇన్‌స్పెక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో SI ఎం. భరత్ బృందం తెల్లవారుజామున 5:30 గంటలకు రైల్వే స్టేషన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.






