- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, నల్లబెల్లి : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో రెండు పాడి ఆవులు (జెర్సీ ఆవులు) మృతి చెందిన సంఘటన మండలంలోని అరిషనపల్లి శివారు లో సోమవారం చోటు చేసుకుంది. బాధిత రైతు పల్నాటి మూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఆర్షనపల్లి శివారులో మేత కోసం వెళ్ళిన ఆవులు (జెర్సీ ఆవులు) ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన పాడి ఆవుల విలువ సుమారు 1,60,000 ఉంటుందని బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






