విద్యుత్ ఆర్టిస‌న్ కార్మికుల స‌మ్మెకు టీఆర్‌వీకేఎస్‌ మ‌ద్ద‌తు

by Nallavelli.Anjaneyulu |

ఎన్పీడీసీఎల్ లో విద్యుత్ ఆర్టిస‌న్ కార్మికుల‌కు క‌న్వ‌ర్ష‌న్, ఎక్సిస్టింగ్ స‌ర్వీస్ రూల్స్ అమ‌లు చేయాల‌ని స‌మ్మె చేస్తున్న కార్మికుల‌కు టీఆర్‌వీకేఎస్‌ మ‌ద్ద‌తు తెలిపింది.

విద్యుత్ ఆర్టిస‌న్ కార్మికుల స‌మ్మెకు టీఆర్‌వీకేఎస్‌ మ‌ద్ద‌తు
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : ఎన్పీడీసీఎల్ లో విద్యుత్ ఆర్టిస‌న్ కార్మికుల‌కు క‌న్వ‌ర్ష‌న్, ఎక్సిస్టింగ్ స‌ర్వీస్ రూల్స్ అమ‌లు చేయాల‌ని స‌మ్మె చేస్తున్న కార్మికుల‌కు టీఆర్‌వీకేఎస్‌ మ‌ద్ద‌తు తెలిపింది. ములుగు రోడ్డులోని వ‌రంగ‌ల్ ట్రాన్స్ కో స‌ర్కిల్ ఆఫీస్ వ‌ద్ద జ‌రుగుతున్న‌న స‌మ్మె వేదిక వ‌ద్ద‌కు టీఆర్‌వీకేఎస్ యూనియ‌న్ రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షులు మాడ దేవేంద‌ర్ రెడ్డి విచ్చేసి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ న్యాయబద్ధమైన ఆర్టిసన్ కార్మికులను యాజమాన్యం చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్మికులతో సమానంగా పని చేస్తున్న ఆర్టిసన్, అన్మన్డ్ కార్మికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారికి సరైన న్యాయం దక్కడం లేదన్నారు. బీమా విష‌యంలో వారికి స‌రైన న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఏఈ జేఏసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేష్, భరత్, ఉమ్మడి జిల్లా చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రెటరీ సునీల్, అడ్వైసర్లు శ్రీనివాస్, మూర్తి, ప్రసాద్, ఆనంద్, రంగారావు, నాయకులు శ్రీనాథ్, సృజన, జయచందర్, జనార్ధన్, రాజేష్ నాయక్, శ్రీకాంత్, సంజీవ, శ్రీనివాస్, రవి, రాజేందర్, కిరణ్, కళ్యాణి, శ్రీలక్ష్మి, బాలాజీ, వంశీ, గోవింద్, సతీష్, రజాక్,మధు ప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story