లారీని దొంగిలించిన కేసులో వ్యక్తికి 14 రోజుల రిమాండ్

by Bhanu |

లారీని దొంగిలించిన కేసులో వ్యక్తికి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

లారీని దొంగిలించిన కేసులో వ్యక్తికి 14 రోజుల రిమాండ్
X

దిశ, దేవరుప్పుల: లారీని దొంగిలించిన కేసులో వ్యక్తికి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రమావత్ హరి కి చెందిన లారీని నెల రోజుల క్రితం అతని దగ్గర పని చేసే బీహార్ కి చెందిన డ్రైవర్ విశాల్ కుమార్ చెందిన దొంగలించుకొని వెళ్ళగా రమావత్ హరి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అందుకుగాను ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతని కోసం గాలించగా సోమవారం (19-05-25) మధ్యాహ్నం పట్టుపడ్డడని వెంటనే అరెస్ట్ చేసి దొంగలించబడిన లారీని గుర్తించి సీజ్ చేసి.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ జనగామ 14 రోజుల రిమాండ్ విధించరని తెలిపారు.ఈ కేసు చేదించడంలో సీఐ పాలకుర్తి మహేందర్ రెడ్డి ఆదేశాలతో,ఎస్సై పవన్ కుమార్, పిఎస్ ఐ రాజేష్, అసిస్టెంట్ అనాలసిస్ ఆఫీసర్ సల్మాన్ పాషా, కానిస్టేబుల్ రమేష్, సురేష్ మనోజ్,రమేష్,రాజకుమార్,రవి లను కేసుని చేదించినందుకుగాను అభినందించారు.

Next Story