- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ దిష్టి బొమ్మ దహనం చేసిన టీఆర్ఎస్వీ నాయకులు
by samatah |
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ మొదటి గెట్ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ ను టీఆర్ఎస్వీ నాయకులు దహనం చేసి,బీజేపీ నిరుద్యోగ మార్చ్ ఫ్లెక్సీని తగల బెట్టారు

X
దిశ, హన్మకొండ : హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ మొదటి గెట్ ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ ను టీఆర్ఎస్వీ నాయకులు దహనం చేసి,బీజేపీ నిరుద్యోగ మార్చ్ ఫ్లెక్సీని తగల బెట్టారు.కేంద్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అక్కడే ఉన్న పోలీసులు టీఆర్ఎస్వీ కార్యకర్తల తో మాట్లాడాలని చూసినా వారు నినాదాలు చేస్తూనే ఉన్నారు.దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేఅందుకు టీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో తరలించారు.పోలీసు వాహనంలో ఉన్న టీఆర్ఎస్వీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదంటూ నినాదాలు చేశారు.నిరుద్యోగ మార్చ్ ని అడ్డుకుంటామన్నారు.
- Tags
- TRSV leaders
Next Story






