- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెన్నెల మృతదేహానికి పెద్ది నివాళులు..
by Taduka Kalyani |
సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామనికి చెందిన వంగ వెన్నెల మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

X
దిశ, దుగ్గొండి: సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామనికి చెందిన వంగ వెన్నెల మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా వెన్నెల మృతదేహాన్ని కొద్ది సేపటి క్రితం ఆమె స్వగ్రామమైన మర్రిపల్లికి తీసుకొచ్చారు. వెన్నెల మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తక్షణసాయం కింద రూ. 50వేలను వెన్నెల కుటుంబానికి ఆయన అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీచ్చారు. వంగ రవి, లక్ష్మి దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. బీటెక్ పూర్తి చేసిన వెన్నెల మూడేళ్లుగా హైదరాబాద్ లోని ఈ కామర్స్ సంస్థలో పని చేస్తోంది. గురువారం రాత్రి అగ్నిప్రమాదంలో అనుకోని రీతిలో వెన్నెల మృత్యువాత పడింది.
Next Story






