- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికొన్ని రోజుల్లోనే అంటూ బిగ్ అప్డేట్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్
తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్

దిశ, సినిమా: ‘ఆర్ఎక్స్-100’ చిత్రంతో టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత కూడా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ అమ్మడు.. ప్రజెంట్ ‘వెంకటలచ్చిమి’ అనే సినిమాలో నటిస్తుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ముని దర్శకత్వంలో ‘సినిమా టికెట్ ఎంటర్‌టైన్మెంట్స్ అండ్ అర్జున్ ఆర్ట్స్ బ్యానర్‌లపై రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇదొక పవర్‌ఫుల్ యాక్షన్ రివెంజ్ డ్రామా అని తెలుస్తుండగా.. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 6 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చింది పాయల్. ‘ఈ సినిమా కోసం నేను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. అలాగే నా కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే ప్రకటిస్తాను. నా కోసం ప్రేక్షకులు వెయిట్ చెయ్యడం కాదు.. నేనే వాళ్లు నన్ను ఎప్పుడు బిగ్ స్క్రీన్‌పై చూస్తారా అని వెయిట్ చేస్తున్నా.. ఖచ్చితంగా 10, 15 రోజుల్లో నా నుంచి మీకు ఒక బిగ్ అప్డేట్ అయితే రాబోతున్నది’ అని చెప్పుకొచ్చింది.






