జీపీడీపీ ప్రణాళిక రూపకల్పన, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి : వేదావతి

by Ratna Kumari |

గ్రామ పంచాయతీల్లో జీపీడీపీ ప్రణాళిక రూపకల్పన, నిధుల వినియోగంలో ఎలాంటి అజాగ్రత్త వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని వరంగల్ డివిజనల్ పంచాయతీ అధికారి వేదవతి హెచ్చరించారు.

జీపీడీపీ ప్రణాళిక రూపకల్పన, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలి : వేదావతి
X

దిశ, గీసుకొండ : గ్రామ పంచాయతీల్లో జీపీడీపీ ప్రణాళిక రూపకల్పన, నిధుల వినియోగంలో ఎలాంటి అజాగ్రత్త వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని వరంగల్ డివిజనల్ పంచాయతీ అధికారి వేదవతి హెచ్చరించారు. గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభలో ఆమోదించిన గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ కార్యదర్శులు, ఈ-పంచాయతీ ఆపరేటర్లు సమన్వయంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని, డిజిటల్ సిగ్నేచర్, చెక్ విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గుర్తించిన పనులు, అంచనా వ్యయాలను ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో జీపీడీపీ ప్లాన్ కింద నిర్ణీత గడువులోగా నమోదు చేయాలని తెలిపారు. టైడ్, అన్‌టైడ్ నిధుల నిబంధనలకు లోబడి మాత్రమే పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీపై జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ దివ్య శిక్షణ ఇచ్చారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ద్వారా సురక్షితంగా చెల్లింపులు ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా వివరించారు. కార్యక్రమంలో గీసుకొండ మండల పంచాయతీ అధికారి పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Next Story