వరంగల్ కమిషనరేట్ లో తొమ్మిది మంది ఎస్సైల బదిలీలు

by Ratna Kumari |

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

వరంగల్ కమిషనరేట్ లో తొమ్మిది మంది ఎస్సైల బదిలీలు
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఎస్సైలను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కొంత మందిని వీఆర్ కు పంపించగా.. మరికొంత మందిని రెగ్యూలర్ డ్యూటీలో నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్ కు పంపారు. వరంగల్ సీసీఎస్ లో పనిచేస్తున్న సాయిప్రసన్న కుమార్ ను నల్లబెల్లి ఎస్ హెచ్ వో గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న గోవర్ధన్ ను వీఆర్ కు బదిలీ చేశారు. మ‌ణికొండలో పని చేస్తున్న జి.రామ్మోహన్ ను ఖానాపూర్ హెస్హెచ్ వో గా నియమించారు. అక్కడ పని చేస్తున్న రఘుపతిని వీఆర్ కు బదిలీ చేశారు. ధర్మసాగర్ లో పనిచేస్తున్న నర్సింహారావును ఎల్కతుర్తి ఎస్ హెచ్ వో గా నియమించారు. అక్కడ పనిచేసిన ప్రవీణ్ కుమార్ ను వీఆర్ కు బదిలీ చేశారు. వరంగల్ లో వీఆర్ లో ఉన్న ఎస్సై శ్రీకాంత్ ను బచ్చన్నపేట ఎస్ హెచ్ వోగా నియమించారు. అక్కడ పని చేస్తున్న హమీద్ ను వీఆర్ కు బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న ఎస్సై మంగను ఖాజిపేట ట్రాఫిక్ ఎస్సై గా నియమించారు. తొమ్మిది మందిని బదిలీ చేయడంతో పాటు ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మందిని బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వీఆర్ కు బదిలీ చేశారు.

Next Story