- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 23 మంది ఎస్సైల బదిలీలు
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 23 మంది ఎస్సైలను బదిలీ చేశారు.

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 23 మంది ఎస్సైలను బదిలీ చేశారు. వీఆర్ లో ఉన్న వారికి పోస్టింగ్ లు ఇవ్వడంతో పాటు స్టేషన్ లో చేస్తున్న వారికి వీఆర్ కు కేటాయించారు. బదిలీ అయిన వారిలో 9 మంది మహిళా ఎస్సైలు ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మంది ఎస్సైలను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే చేరాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సుబేదారి ఉమెన్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్సైగా ఉన్న మౌనికను కాజిపేట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. సీసీఆర్బి వరంగల్ లో ఉన్న ఎస్.కిరణ్ మైని హన్మకొండ బరోసా సెంటర్ బదిలీ చేశారు. వరంగల్ సీపీటీసీ ఎస్సై సీహెచ్ లలితను జనగామ బరోసా సెంటర్ కు బదిలీ చేశారు.
పీసీఆర్ వరంగల్ ఎస్సై తౌటం శ్రావణిని కేయూ పోలీస్ స్టేషన్ కు, పీసీఆర్ మరో ఎస్సై నిహారికను మిల్స్ కాలనీకి, వీఆర్ లో ఉన్న భవానిని ఇంతజార్ గంజ్ పీఎస్ కు, బరోసా సెంటర్ హన్మకొండలో ఉన్న తుమ్మ శ్రావణిని మిల్స్ కాలనీకి, వరంగల్ ఐటీసెల్ లో ఉన్న సాయిదివ్యను హన్మకొండ పీఎస్ కు, జనగామ బరోసా సెంటర్ లో కె.లక్ష్మిని సుబేదార్ పీఎస్ కు బదిలీ చేశారు. వరంగల్ సీపీటీసీలో హరికృష్ణను సుబేదారి పీఎస్ కు, వీఆర్ వరంగల్ లో ఉన్న సీహెచ్ రఘుపతిని పరకాల పీఎస్ కు, వరంగల్ లో వీఆర్ లో ఉన్న గోవర్ధన్ ను ఎనుమాముల పీఎస్ కు బదిలీ చేశారు.
వరంగల్ లో వీఆర్ లో ఉన్న రాజన్ బాబును నర్సంపేట పీఎస్ కు, వీఆర్ వరంగల్ లో ఉన్న రవీంధర్ ను గీస్కొండ పీఎస్ కు, హన్మకొండ ట్రాఫిక్ పీఎస్ లో ఉన్న ఎల్.కొమురెల్లిని సీఎస్బీ వరంగల్, ఇంతజార్ గంజ్ పీఎస్ లో ఉన్న రవికిరణ్, సుబేదార్ పీఎస్ లో ఉన్న ఎస్.వెంకన్న, ధర్మసాగర్ పీఎస్ లో ఉన్న షేక్ జానీబాషాలను సీఎస్బీకి కేటాయించారు. కాజిపేట పీఎస్ లో ఉన్న నవీన్ కుమార్ ను సీఎస్బీకి అటాచ్ చేశారు. టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్సై బి.చందర్ ను సీసీఎస్ వరంగల్ కు, పరకాల పీఎస్ లో పనిచేస్తున్న ఎం.రమేష్, మిల్స్ కాలనీలో పనిచేస్తున్న ఎల్.నరేష్ లను సీసీఆర్బీకి బదిలీ చేశారు. ఐనవోలు ఎస్ హెచ్ వోగా ఉన్న పి.శ్రీనివాస్ ను పీసీఆర్ వరంగల్ కు అటాచ్ చేశారు.






