జనగామలో విషాదం.. విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి

by Kodari Anjali |

జనగామ మండలం చీటకోడూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

జనగామలో విషాదం.. విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్‌ మృతి
X

దిశ, జనగామ: జనగామ మండలం చీటకోడూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై లైన్‌మెన్‌ రాధమల్ల కరుణాకర్ రెడ్డి మృతి చెందారు. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన లైన్ తనిఖీ చేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. విద్యుత్ స్తంభం ఎక్కి పనులు నిర్వహిస్తున్న సమయంలో అనుకోకుండా కరెంట్ షాక్ తగలడంతో కరుణాకర్ రెడ్డి స్తంభంపై నుంచి కిందపడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కరుణాకర్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, సహచర ఉద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Next Story