- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తరగతి గదులు లేక ఆరు బయటనే పాఠాలు..
by Kodari Anjali |
పాఠశాల భవనం అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉండగా టీచర్స్ విద్యార్థులకు ఆరు బయటనే పాఠాలు చెబుతున్నారు.

X
దిశ, లక్ష్మణచాంద: నిర్మల్ జిల్లా, మండల కేంద్రమైన లక్ష్మణ్‌చందలోని ప్రాథమిక పాఠశాలలో భవన గదులు లేక విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఉపాధ్యాయులు కొన్ని తరగతులు ఆరుబయటే కొనసాగిస్తున్నారు. సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఉపాధ్యాయులు తెలియజేశారు. రెండున్నర సంవత్సరాలుగా అసంపూర్తిగా నిర్మాణ దశలోనే ఉండిపోయిన భవనాలు మరియు కాలం చెల్లిన భవనాలు కూడా ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న గదులలో పిల్లలను వుంచి పాటలు చెప్పడం ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయభ్రాంతులకు గురవుతున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు. తరగతులు నిర్వహించడానికి గదులు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు తెలిపారు.
Next Story






