- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జర్నలిస్ట్ పై దాడి..ఎమ్మార్వో కు వినతి అందజేత
by velandi.Saikiran |
జర్నలిస్టు ప్రకాష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎమ్మార్వో మునీరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు.

X
దిశ, బిజినేపల్లి: జర్నలిస్టు ప్రకాష్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎమ్మార్వో మునీరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్ట్ ప్రకాష్ తన కారులో కూర్చుని టీ తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రెచ్చగొట్టారు. దీంతో ఆమె ప్రకాష్ పై దాడి చేశారు. ఇట్టి విషయంపై పూర్తి విచారణ చేసి ఈ దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు టీయూడబ్ల్యూజేఐజేయూ మండల అధ్యక్షులు సుదర్శన్, తాలూకా కార్యవర్గ సభ్యులు మస్కూరి బంగారయ్య, మిద్దె బంగారయ్య, మండల జర్నలిస్టులు పృథ్వీరాజ్, కిషోర్, మధు, మహేష్ ,నరసింహలు డిమాండ్ చేశారు. లేని యెడల జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.
Next Story






