- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం ఎస్పీపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు.. దీక్షకు దిగుతున్నట్లు ప్రకటన
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హింస జరుగుతోందని, కానీ జిల్లా ఎస్పీ జగదీశ్ మాత్రం మౌనంగా ఉంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు....

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) తాడిపత్రి(Tadipatri)లో హింస జరుగుతోందని, కానీ జిల్లా ఎస్పీ జగదీశ్(SP Jagadeesh) మాత్రం మౌనంగా ఉంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకట్రామిరెడ్డి(YCP District President Anantha Venkatarami Reddy) ఆరోపించారు. అంతేకాదు జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసనల్లోనే పోలీసులు పని చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు.రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయని, తాడిపత్రిలోనూ గాలికొదిలేశారని మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ తాను ఈ నెల 26న తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేస్తానని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ...
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former MLA Kethireddy Peddareddy) మాట్లాడుతూ తాడిపత్రి పోలీసులకు జీతాలకంటే లంచం డబ్బులు పది రెట్టు వస్తోందని ఆరోపించారు. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువని ఆయన వ్యా్ఖ్యానించారు. పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలని ఎద్దేవా చేశారు.





