- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. యువకుడు మృతి
by Kodari Anjali |
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వేగంగా వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయ్యాడు.

X
దిశ, మరికల్: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వేగంగా వస్తున్న కారు ఢీకొని మంగళవారం రాత్రి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మరికల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మరికల్ మండలం తీలేరు స్టేజి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన కే భరత్ కుమార్ రెడ్డి అనే యువకుడు మరికల్ నుంచి రాకొండ గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి 11:30 గంటలకు తీలేరు స్టేజి వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో రాకొండ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






