వికలాంగుల నూతన భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు వినతి

by Kodari Anjali |

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి విహెచ్పిఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

వికలాంగుల నూతన భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు వినతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వికలాంగుల భవనాన్ని సత్వరమే ప్రారంభించాలని కోరుతూ వీహెచ్‌పీఎస్ బృందం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు బుధవారం తిరుమల హిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాళ్ల జంగయ్య ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు గువ్వల యాదయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మండల శాఖ అధ్యక్షులు ఆకుల సంజీవ, యాచారం మండల శాఖ అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వికలాంగుల సంక్షేమం కోసం నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభిస్తే దివ్యాంగులకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.

Next Story