- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ యాంగిల్స్‌లో కిల్లింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాకు హీట్ పెంచుతున్న శ్రీలీల
గోల్డ్ ఎంబ్రాయిడరీ శారీలో మెరిసిన శ్రీలీల

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమలో తొలి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యువ కథానాయికల్లో శ్రీలీల ఒకరు. రోషన్ మేక హీరోగా తెరకెక్కిన ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ‘ధమాకా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఒక్కసారిగా తన క్రేజ్‌ను పెంచుకుంది.
దాంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలపైనా ఆసక్తి చూపిస్తున్న శ్రీలీల, ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక సినిమాల్లో తన అందంతో ఆకట్టుకునే శ్రీలీల, సోషల్ మీడియాలోనూ అదే స్థాయిలో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
పచ్చని మొక్కల నడుమ సోఫాపై కూర్చొని, గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లూ శారీలో శ్రీలీల ఎంతో స్టైలిష్‌గా మెరిసింది. ఈ ఫోటోల్లో ఆమె ఫ్రంట్, బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా ఫోజులు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రెండు చెవుల చుట్టూ పెద్ద ఎత్తున ఇయర్ రింగ్స్ ధరించి, కొన్ని ఫోటోల్లో కురులు ముఖంపై జారేలా, మరికొన్నింటిలో వెనక్కి వదిలేసి శ్రీలీల మరింత అందంగా కనిపించింది. మొత్తంగా ఈ లేటెస్ట్ పిక్స్‌లో ఆమె సూపర్ సాలిడ్ లుక్‌లో మెరిసిపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
Photos Courtesy: Instagram






