- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజగోపురం నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ
అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి రాజగోపురానికి బుధవారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు.

దిశ, మక్తల్: అతి పురాతనమైన పడమటి ఆంజనేయస్వామి రాజగోపురానికి బుధవారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. 50 లక్షల నిధులు మంజూరు కావడంతో భూమి పూజ చేశారు. కార్యక్రమానికి వస్తున్న మంత్రిని మేళతాళాలతో స్వాగతం పలికి ఆలయ ధర్మకర్త ప్రాణేశచారి ఈవో నిత్యానందచారి శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అత్యంత పురాతనమైన దేవాలయం కొలువై ఉన్న పొడవు పడమటి ఆంజనేయస్వామిని మహిమ గల దేవుడు అని కోరికలు తీర్చే ఇలవేల్పుని భక్తులు విశ్వాసం. నిత్యం భక్తుల దర్శనాలతో రద్దీగా ఉండీ ఇత రాష్ట్రాల భక్తులు దర్శనానికి వచ్చి తమ మొక్కలు తీర్చుకుంటారని.. రాయచూర్, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఆలయం ఈ మార్గం గుండా ప్రయాణించేవారు స్వామికి గాలిగోపురం ఉండాలన్న భక్తుల కాంక్షను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు.
అంజన్న స్వామి వారి ఉత్సాహాల లోపు...
దాదాపు అరకోటి నిధు లను మంజూరు చేయించాడు. గతం మూడు రోజుల కిందట ఎండోమెంట్ విభాగం స్థపతి సంబంధిత ఇంజనీర్స్ విభాగాలు రూపొందించిన ఎస్ట్మెంట్లు ప్రకారము 14 ఫీట్ల వెడల్పు 36 ఫీట్ల ఎత్తుతో రాజగోపురం నిర్మించాలని రూపొందించిన డ్రాయింగ్ మ్యాప్ ను మంత్రి చేతుల మీద విడుదల చేశారు, పనుల్లో ఆలస్యం ఉండకుండా డిసెంబర్ నెలలో ప్రారంభమయ్య పడమటి అంజన్న స్వామి వారి ఉత్సాహాల లోపు రాజగోపురం నిర్మాణం పని పూర్తి చేయాలని నిర్మాణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నాణ్యమైన పనులతో పూర్తి చేయాలని నిధులు తక్కువ పడితే తను మరిన్ని నిధులను కేటాయిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మానస, కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షుడు రవికుమార్. కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.






