- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన 'ది ప్యారడైజ్'.. మిగిలింది అవి మాత్రమే?
‘ది ప్యారడైజ్’ షూటింగ్ 70–80 శాతం పూర్తైనట్లు సమాచారం. క్లైమాక్స్, కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి మమత బైజు హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆ తేదీకే సినిమా విడుదల కావడం కష్టమే అనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు పూర్తైనట్లు సమాచారం.
ఇంకా క్లైమాక్స్‌తో పాటు కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచేశాయి.






