చింత‌గ‌ట్టు క్యాంపు వ‌ద్ద ట్రాఫిక్ జామ్

by Ratna Kumari |

హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపు సమీపంలోని బ్రిడ్జి వద్ద సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

చింత‌గ‌ట్టు క్యాంపు వ‌ద్ద ట్రాఫిక్ జామ్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపు సమీపంలోని బ్రిడ్జి వద్ద సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమే అయినా ఉదయం భారీగా వాహనాలు రావడంతో.. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగ సెలవులు పూర్తవడం, స్కూళ్లు రీ ఓపెన్, ఆఫీసులకు వెళ్లే వారంతా వాహనాలతో రోడ్డు పైకి వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బీమారం నుంచి ఎర్రగట్టు జంక్షన్ వరకు గంటకు కిలోమీటరు కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఇంటిలిజెంట్, ఎస్బి పోలీస్ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Next Story