​కేకే ఓపెన్ కాస్ట్ కోసం అటవీయేతర భూములను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్..

by Taduka Kalyani |   (  Updated:2026-07-22 16:13:55  IST  )

మందమర్రి ఏరియా ​పెద్దనపల్లి గ్రామంలో కేకేఓసీ ఎన్‌ఎఫ్‌ఎల్ భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతంలో కలెక్టర్ కుమార్ దీపక్ , సబ్ కలెక్టర్ డి. మనోజ్ లు పర్యటించారు.

​కేకే ఓపెన్ కాస్ట్ కోసం అటవీయేతర భూములను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్..
X

దిశ, మందమర్రి: మందమర్రి ఏరియా ​పెద్దనపల్లి గ్రామంలో కేకేఓసీ ఎన్‌ఎఫ్‌ఎల్ భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతంలో కలెక్టర్ కుమార్ దీపక్ , సబ్ కలెక్టర్ డి. మనోజ్ లు పర్యటించారు. ఈ సందర్భంగా కేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నిమిత్తం పెద్దనపల్లి గ్రామంలో అటవీయేతర భూములను (నాన్ ఫారెస్ట్ ల్యాండ్ ) కు చెందిన భూసేకరణ ప్రతిపాదిత ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , సబ్ కలెక్టర్ డి. మనోజ్ తో కలిసి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​ ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన పటాలను, సరిహద్దులను అధికారులతో కలిసి వారు సమగ్రంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టు పురోగతి, భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం మరియు స్థానిక రైతులు, నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంపై అధికారులకు పలు సూచనలు చేశారు.​ఈ తనిఖీ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ .రాధాకృష్ణ , కేకే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు సంబంధిత రెవెన్యూ అధికారులు, సింగరేణి యాజమాన్య ప్రతినిధులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story