- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిపాటికి దాశరథి సాహితీ పురస్కారం ప్రదానం
దాశరథి రచనలను రచించి సమాజానికి అంకితం చేశారని సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు.

దిశ, రవీంద్ర భారతి: దాశరథి రచనలను రచించి సమాజానికి అంకితం చేశారని సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. దాశరథి తన ప్రతి నిమిషం ప్రతి అడుగు సమాజహితం కోసమే కృషి చేశారని ఆమె కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డా. దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి ఉత్సవాలు, ‘దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవం సభ బుధవారం సాయంత్రం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ వాణి ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటేశ్వర్లుకు ప్రతిష్టాత్మక దాశరధి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారంతోపాటు నగదు 1,01,116 అందచేశారు. ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ, దళిత బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై సమాజాన్ని చైతన్యపరిచారని, ఆయన సోషల్ రిఫార్మర్ అని ఆమె అన్నారు. తెలంగాణ వైతాళికుడు డా. దాశరధి అని.. దాశరథి పాట వినకుండా తెల్లవారదు. పొద్దుఊకదని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్ (ఐఏఎస్) అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మంగి వేణుగోపాల్, దాశరథి కుమారుడు దాశరథి లక్ష్మణ్, కూతురు ఇందిరా, కవులు సాహిత్య వేత్తలు పాల్గొన్నారు.






