బొమ్మ.. బొరుసుతో అభ్య‌ర్ధిత్వం

by Bhanu |   (  Updated:2025-11-28 08:59:47  IST  )

మహబూబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఘర్షణాత్మక పోటీ చోటుచేసుకుంది.

బొమ్మ.. బొరుసుతో అభ్య‌ర్ధిత్వం
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీ కాంగ్రెస్‌లో ఘర్షణాత్మక పోటీ చోటుచేసుకుంది. ఈసారి రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ స్థానం బీసీ జనరల్*కు కేటాయించడంతో ఇద్దరు స్థానిక నాయకులు బరిలోకి దిగారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జర్రిపోతుల ఉపేందర్, కార్యదర్శి కొత్త హేమంత్ లు అభ్యర్థిత్వం కోసం పట్టుదలగా నిలవడంతో గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతర్గత ఓటింగ్ నిర్వహించారు. అయితే ఓటింగ్‌లో ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో ఎంపిక సంక్లిష్టమైంది. చివరికి వివాదానికి తెరదించేందుకు నేతలు బొమ్మ బొరుసు వేశారు. అదృష్టం హేమంత్‌వైపు నిలవడంతో ఆయనే కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అనంతరం ఆయన అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామస్థాయిలోనే ఎన్నికల ఉత్కంఠను తలపించేలా జరిగిన ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story