ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మృతి..

by Bhanu |

ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుండి జారిపడి చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభుని పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు గీత కార్మికుడు మృతి..
X

దిశ, కమలాపూర్ : ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుండి జారిపడి చికిత్స పొందుతూ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శంభుని పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జనగాని సుభాష్(45) ఈనెల 20వ తేదీన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు పై నుండి పడి తీవ్ర గాయాలు కాగా హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. మృతునికి భార్య సుమలత, కుమారుడు ఉన్నారు.




Next Story