- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి వరంగల్ కవరయ్యేలా.. ప్రజాపాలన విజయోత్సవ సభ
సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటించనున్నారు. నర్సంపేట పరిధిలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటించనున్నారు. నర్సంపేట పరిధిలో రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నర్సంపేటలో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభ గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపునకు దోహదపడుతుందనే దీమాతో ఉన్నారు. సభ ద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలకు పలు కీలక హామీలు ఇవ్వడంతో పాటు పూర్తిస్థాయిలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే అవకాశం ఉండటంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారికి కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కీలక స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. మళ్లీ అదే తీరులో సర్పంచ్, వార్డు పదవులను కైవసం చేసుకునేలా పావులు కదుపుతూ సీఎం సభ విజయవంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు హాజరవడంతో పాటు సభను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సభకు హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సభలో సీఎం చేసే ప్రకటనలు గ్రామాల్లో ప్రతిఒక్కరికీ తెలిసేలా జాగ్రత్త పడుతున్నారు.
ఏర్పాట్లపై దొంతి ప్రత్యేక శ్రద్ధ
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ పాదయాత్ర సమయంలో రేవంత్ రెడ్డి నర్సంపేటకు రాలేదు. ఫస్ట్ టైమ్ సీఎం హోదాలో వస్తుండటంతో సభను సక్సెస్ చేయడంపై నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టి పెట్టారు. ప్రత్యేక శ్రద్ధతో దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.






