ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ లారీ

by velandi.Saikiran |

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఓ యువకునికి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేట

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ లారీ
X

దిశ, వర్థన్నపేట : ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొనడంతో ఓ యువకునికి తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసితండా వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో భూక్యా శ్రీనివాస్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story