- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి కేసులో ముగ్గురు యువకులు అరెస్ట్
తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ పరిధిలో గంజాయి వినియోగం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ, తొర్రూరు : తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామ పరిధిలో గంజాయి వినియోగం వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 5, 2026న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో ఎస్సై ఖాదర్ పాషా సిబ్బందితో కలిసి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రానైట్ క్వారీ రోడ్డులో ఒక మోటార్ సైకిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు అమ్మాపురానికి చెందిన కళ్యాణి విజయ్ (21), దంతాలపల్లి సాగర్ (26), గంధం మహేష్ (21) గా గుర్తించారు. విచారణలో వీరికి గంజాయి సేవించే అలవాటు ఉందని, వారం రోజుల క్రితం ఒడిశా రాష్ట్రానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చినట్టు తెలిపారు. గంజాయి సేవించేందుకు అక్కడికి వచ్చినట్టు అంగీకరించారు.
వారి వద్ద ఉన్న కవర్‌లోని గంజాయిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకుని తూకం వేయగా.. 254 గ్రాములు ఉండగా.. దీని విలువ సుమారు రూ.12,700గా అంచనా వేశారు. అదేవిధంగా నాలుగు సిగరెట్లు, ఒక అగ్గిపెట్టె, ఒక మోటార్ సైకిల్, సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో కీలక సమాచారం అందించిన వ్యక్తికి జిల్లా ఎస్పీ శబరిస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రూ.5,000 నగదు బహుమతి అందజేశారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ చర్యల్లో ఎస్సై ఖాదర్ పాషా, హెడ్ కానిస్టేబుల్ సారయ్య, కానిస్టేబుళ్లు వేణు, శరత్, భావసింగ్ పాల్గొన్నట్లు తొర్రూరు ఎస్సై జి ఉపేందర్ తెలిపారు.






