పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్

by Kodari Anjali |

హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్ అయ్యారు.

పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్
X

దిశ, వరంగల్ బ్యూరో: హనుమకొండ పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు పరార్ అయ్యారు. ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులను నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొన్నారు. వారిని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. వారు హనుమకొండ పోలీసు స్టేషన్ లాకప్‌లో ఉంచారు. పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు సెంట్రీ డ్యూటీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరార్ అయ్యారు.

ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో పారిపోయిన దొంగలను పట్టుకోవడానికి హనుమకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి కేసులో అరెస్టు అయిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో వారి సెల్పోన్ కాల్స్‌పై నిఘా పెట్టారు. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో గాలింపుతో పాటు గతంలో ఈ కేసుల్లో అరెస్టు అయిన వారి ద్వారా ఆరా తీస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి సెంట్రీ డ్యూటితో పాటు విధుల్లో ఉన్న పోలీసులను విచారిస్తున్నారు. పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మామూనూరు పీఎస్ నుంచి ఇద్దరు గంజాయి దొంగలు గత నెలలో పరార్ అయిన విషయం తెలిసిందే. ఈ స్టేషన్‌లో విధుల నిర్లక్ష్యంతో ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటుపడింది. ఇది జరిగి నెల రోజులు కాకముందే మళ్లీ హనుమకొండ పీఎస్ నుంచి మరో ముగ్గురు గంజాయి నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు ఈ విషయం సీరియస్‌గా తీసుకున్నారు.

Next Story