- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ 23 గ్రామాలు షెడ్యూల్ ట్రైబల్ కాదు
ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ మంగళవారం సుప్రీం కోర్టు మద్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఆ 23 గ్రామాలు షెడ్యూల్ ట్రైబల్ కాదు
: సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
దిశ, మంగపేట : ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ట్రైబల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ మంగళవారం సుప్రీం కోర్టు మద్యంతర ఉత్తర్వులిచ్చింది. 2013లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మండలానికి చెందిన చింతా పరమాత్మ, పూజారి సమ్మయ్యలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. గ్రామాల కేసు విచారణ జరిపిన జస్టిస్ మహేశ్వరి ధర్మాసనం మంగపేట మండలంలోని 23 గ్రామాలను షెడ్యూల్ ట్రైబ్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ మద్యంతర ఉత్తర్వులిచ్చింది. 1950 లో రాష్ట్రపతి ఇచ్చిన షెడ్యూల్ ట్రైబ్ ఆర్డర్ లో మంగపేట మండలంలోని 23 గ్రామాలు లేవని 2013 లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నిజాం ఆర్డర్ ఆధారంగా ట్రైబల్ గ్రామాలుగా పరిగణించాలని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు తీర్పుతో మండలంలోని నాన్ ట్రైబల్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1950 లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ లో మంగపేట లోని 23 గ్రామాలు లేవని సీనియర్ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు.






