- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > వరంగల్ > కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కొండా సురేఖ
కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కొండా సురేఖ
by Ratna Kumari |
కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం మంత్రి కొండా సురేఖ అన్నారు.

X
దిశ, వరంగల్ బ్యూరో : కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ లోని లక్ష్మీపురం మార్కెట్లో శుక్రవారం నిర్వహించిన మేడే వేడుకల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి పాల్గొన్నారు. కార్మికులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని,వారి కృషి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,వారి సేవలను గుర్తించి గౌరవించడం మనందరి కర్తవ్యమని మంత్రి సురేఖ తెలిపారు.
Next Story






