- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విప్లవాల వేగుచుక్క చాకలి ఐలమ్మ
తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవాల వేగుచుక్క చాకలి ఐలమ్మ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కొనియాడారు.

విప్లవాల వేగుచుక్క చాకలి ఐలమ్మ
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి
నెక్కొండలో ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ
దిశ,నెక్కొండ: తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవాల వేగుచుక్క చాకలి ఐలమ్మ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కొనియాడారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలకేంద్రంలోని హైస్కూల్ సెంటర్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చిట్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాగుతున్న పోరాటంలో ఐలమ్మ సైతం తనవంతు పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు. దొరలు, దేశ్ ముఖ్ లు, పటేల్, పట్వారీల ఆగడాలను ఎదుర్కొని పోరాటం చేసిన వీరవనిత అని అన్నారు. విస్నూర్ రామచంద్రారెడ్డి పంపిన గుండాలను రోకలి బండ చేతపట్టి తరిమికొట్టిందని గుర్తు చేశారు. ఆనాడు భూపోరాటంలో,తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా రజకుల కోరిక మేరకు రజకుల ఆరాధ్య దైవం మడేలు మాచయ్య గుడి నిర్మాణం కోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుండి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఐలమ్మ విగ్రహదాత చల్లా రఘోత్తం రెడ్డి, రెయిలింగ్ దాత తాటిపెళ్లి శివ కుమార్ ను పలువురు ప్రశంసించారు. అనంతరం పొట్లపల్లి శిరీష సురేష్ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్లు రావుల హరీష్ రెడ్డి, పాల్వాయి శ్రీనివాస్, తహసీల్దార్ వేముల రాజ్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, డాక్టర్ పులి, అనిల్, రజక సంఘం అధ్యక్షులు రామారపు, వీరస్వామి, లక్ష్మీ నారాయణ,ఈఓ సదానందం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, హరి ప్రసాద్, సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు, నాయకులు ఈదునూరి వెంకన్న, కులస్తులు రామారపు శిరీషరాము, రాము, బొడ్డుపెల్లి రాజు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.






